2015లో వచ్చిన మోసగాళ్లకు మోసగాళ్లు అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ నందినీ రాయ్. తొలిసినిమాతోనే మంచిపేరు సంపాదించుకున్న హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే బిగ్ బాస్ షో ద్వారా తన పాపులారిటీ పెంచుకున్న నందినీ…తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణంపై స్పందించారు నందినీ రాయ్. సుశాంత్ మరణం తనను కలచివేసిందని….డిప్రెషన్లో తాను కూడా పలుమార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని వెల్లడించింది.
ఇండస్ట్రీలో విజయాలతో పాటు పాపులారిటీ, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందని…. క్రమంగా మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌కు లోనవుతారు అని నందినీ రాయ్ చెప్పారు. బిగ్ బాస్ తర్వాత తన డిప్రెషన్ దూరమైందన్నారు.డిప్రెషన్ నుంచి బయటపడాలంటే నలుగురితో కలిసి ఉండాలని, స్నేహితులతో సరదాగా గడపాలని, యోగా, వ్యాయామాలు చేయాలని అన్నారు.