విడుదలకు సిద్దమైన ఉదయ్ కిరణ్ చివరి మూవీ

245
- Advertisement -

హీరో ఉదయ్ కిరణ్ మరణించి చాలా ఏండ్లు గడిచినా కానీ ఆయన నటించిన చివరి చిత్రం మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా విడుదల కోసం చాలా మంది ఉదయ్ కిరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ. ఈ మూవీ షూటింగ్ మధ్యలో ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగతా పార్ట్ ను డూప్ తో తీశారు. అయితే ఇన్ని రోజులు ఈమూవీ విడుదలకు ఆలస్యం అయింది ఎట్టకేలకు ఈమూవీని ఓటీటీలో విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ఉదయ్ కిరణ్ సినిమాను తీసుకోవడానికి చాలా ఓటీటీలు సిద్ధంగా ఉన్నాయి.

ఉదయ కిరణ్ మరణం తర్వాత ఈమూవీని నిర్మించేందుకు ఏ నిర్మాత పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పడు ఈసినిమాను ఓటీటీలో విడుదల చేసినా నిర్మాతలకు పెద్దగా డబ్బులు రావని అంటున్నారు. అయితే లాక్ డౌన్ నేపధ్యంతో ఓటీటీకి డిమాండ్ పెరిగింది. థియేటర్లు మూత పడటంతో చాలామంది ఓటీటీ లో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదయ్ కిరణ్ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు చిత్రయూనిట్. ఇదిలాఉండగా బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య తర్వాత ఉదయ్ కిరణ్ పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. అప్పట్లో ఉదయ్ కిరణ్ ఇప్పడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఉదయ్ కిరణ్ అభిమానులు.

- Advertisement -