చైనా గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో వీరమరణం పోందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూర్యాపేటకు వెళ్లుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన రోడ్డు మార్గం ద్వారా సూర్యాపేటకు బయలుదేరారు. ప్రస్తుతం సీఎం కాన్వాయ్ తుర్కపల్లి దాటింది. అక్కడి నుంచి భువనగిరి, వలిగొండ, చిట్యాల,నార్కెట్ పల్లి, కట్టంగూర్, నకిరేకల్ మీదుగా సీఎం కాన్వాయ్ సూర్యాపేటకు చేరుకుంటుంది. సూర్యాపేటలోని విద్యానగర్‌లో సంతోష్ బాబు నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమనికి సంబంధించిన ఏర్పాట్లును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. సంతోష్ బాబు నివాసం వద్ద అన్ని ఏర్పాట్లును ఆయన పర్యవేక్షణ చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే లు,ఎంపీలు మరియు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కరన్ మరియు సిఎం సెక్యూరిటీ అధికారులు ఉన్నారు.