సంతోష్ కుటుంబసభ్యులకు జగదీష్ పరామర్శ…

271
jagadish reddy
- Advertisement -

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు. సంతోష్ ఇంటికి వెళ్లిన జగదీష్ రెడ్డి వారిని ఓదార్చారు.

అంతకముందు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌తో కలిసి వాడపల్లి కృష్ణ ,మూసి సంగమం లో సంతోష్ అస్తిక‌ల‌ను నిమ‌జ్జనం చేశారు.

ఇక సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపిన సంగతి తెలిసిందే. రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్.

- Advertisement -