‘ఫైట‌ర్’ లో మార్పులు ఉండ‌వుః ఛార్మీ

251
charmi puri
- Advertisement -

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ త‌ర్వాత ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేస్తున్నాడు. ఈమూవీకి ఫైట‌ర్ లేదా లైగ‌ర్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్, క‌రణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈమూవీ షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్తి చేసుకుంది. విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తుంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ ప‌డింది.

క‌రోనా నేప‌థ్యంలో ఫైట‌ర్ మూవీ క‌థ‌ను మార్చ‌నున్న‌ట్లు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ ప్ర‌చారంపై స్పందించారు నిర్మాత ఛార్మీ. స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయం, చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఫైట‌ర్ స్క్రిప్ట్ బ్లాక్ బ‌స్టర్. క‌రోనా క్రైసిస్ ముగిసిన త‌ర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. సినిమాపై చాలా న‌మ్మకంతో ఉన్నాం అన్నారు. త్వ‌ర‌లోనే మూవీ టైటిల్ ఫ‌స్ట్ లుక్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -