హరితహారం కార్యక్రమంలో ఉపాధి కూలీలను వాడుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్ ఆర్ జి ఎస్ పనులు మూస పద్దతిలో కాకుండా అభివృద్ధి పనులకు అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ మోచన అని తెలిపారు. హరితహారంలో భాగంగా మొక్కలను పెద్ద సంఖ్యలో నాటాలని ఆదేశాలు జారీ చేసామన్నారు. వైకుంఠ దామాలకు చెట్లతోనే గ్రీన్ ఫెన్సింగ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమానికి దాదాపు రూ.140కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కల్ని కాపాడుకోవాలన్నారు.
ఇరిగేషన్ లో కూడా ఎన్నార్జిఏస్ ను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. కొత్త జాబ్ కార్డు కోసం వచ్చే సోమవారం నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి తెలిపారు. రైతులను సంఘటితం చేసేందుకు జిల్లాలో 106 రైతు వేదికలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. మీడతలు ప్రస్తుతం ఈశాన్యం వైపు వెళ్తున్నాయి. గాలి దిశ మారితే ఇటు వచ్చే అవకాశం ఉంది. మిడతలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.