- Advertisement -
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా మారుమూల తండాలలోని ప్రతి గడపగడపకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం. ముద్విన్ గ్రామంలోని కర్ణమోని కుంటలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పూడికతీత పనులను ప్రారంభించారు.
అనంతరం చరికొండ గ్రామపంచాయతీ పరిధిలోని బోయిన కుంట తండాలో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -