- Advertisement -
నిర్మల్ లో తన సొంత నిధులతో రైతు వేదికను నిర్మిస్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు మంత్రి . నిర్మల్ జిల్లాలోని న్యూ పోచం పహాడ్ లో అక్కపూర్ క్లస్టర్ రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి అల్లోల భూమిపూజ చేశారు. ఈకార్యక్రమంలో స్ధానిక ప్రజాప్రతినిధులతో పాటు రైతులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ…రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలనే వేసి లాభాలను గడించాలన్నారు. రైతులను ఆర్ధికంగా పైకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.
- Advertisement -