చైనాతో సరిహద్దు వివాదంపై స్పందించిన మోదీ..

232
pm modi
- Advertisement -

నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సమావేశంలో సైనికుల త్యాగాలను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు ప్రధాని. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రులు మౌనం పాటించారు. సైనికుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమన్నారు ప్రధాని. భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

సైనికుల త్యాగాలు వృథాగా పోవని దేశానికి హామీ ఇస్తున్నా అని మోదీ వ్యాఖ్యనించారు. దేశ, ఐక్యత సార్వభౌమాధికారం అత్యంత ప్రాధాన్యతాంశాలు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. ఎవరైనా రెచ్చగొడితే దీటుగా బదులు ఇవ్వడానికి సిద్ధం అని ప్రధాని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

- Advertisement -