- Advertisement -
చరిత్రలో తొలిసారి…ప్రతిష్టాత్మక ఆస్కార్స్ వేడుకలు వాయిదా పడ్డాయి.చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ వేడుకలను 8 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆస్కార్ అకాడమీ ప్రకటించింది.
దీంతో వచ్చే ఏడాది జరగనున్న 93వ ఆస్కార్ పురస్కారాల వేడుకలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 25వ తేదీన ఆస్కార్ పురస్కారాల ప్రధానం ఉంటుందని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ తెలిపారు. నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆలస్యం అవుతున్న కారణంగా.. అవార్డుల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయాల్సి వస్తున్నట్లు తెలిపారు. అయితే ఆస్కార్స్ కోసం పోటీపడే చిత్రాల అర్హత తేదీను పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.
వాస్తవానికి ఆస్కార్స్ నామినేషన్స్ అంటే ఉండే హంగామా అంతా ఇంతకాదు. ప్రపంచదేశాల్లో సత్తాచాటిన సినిమాలు ఇందులో ప్రదర్శింప బడుతుండగా కరోనాతో ఈ వేడుకలు వాయిదా పడ్డాయి.
- Advertisement -