స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీకి ఇది 20వ సినిమా
సినిమా ప్రారంభం అయిన దగ్గరి నుండి రోజుకో వార్త టీ టన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం ఏకంగా అటవి సెట్‌నే వేస్తున్నారట. మహబూబ్ నగర్ అడవుల్లో ఒక సెట్ అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో మరో సెట్ వేస్తున్నారని టాక్ నడుస్తోంది. కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట తెరకెక్కించనున్నారట.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా జులై మొదటి వారంలో పాటల చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభం కానుంది. బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా ఆర్య,ఆర్య 2 తర్వాత బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.