- Advertisement -
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి వానాకాలం పంట సాగు కొరకు నీటిని విడుదల చేశారు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు ఆలోచనతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో బీడు బారిన భూములన్నీ పచ్చని పంటపొలాలతో కలకళలాడుతున్నాయన్నారు.
ముందస్తూ ప్రణాళికతో మిషన్ కాకతీయ ద్వారా చేరువులన్ని పునరుద్ధరణ చేసుకొని నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి వానాకాలం పంట సాగు కొరకు నీటిని విడుదల చేశారు. నియోజకవర్గంలో చెరువులన్నీ గోదావరి జలాలతో నింపుకొని రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు ఎమ్మెల్యే.
- Advertisement -