విలక్షణ సినిమాలకు కేరాఫ్ కమల్ హాసన్. వైవిధ్యమైన సినిమాలు చేసి లోకనాయకుడిగా ఇమేజ్ సంపాదించుకున్న కమల్…భారతీయ సినిమా పరిశ్రమ గర్వించ దగ్గనటుల్లో ఒకరు. ఇక కమల్…రెహ్మాన్‌తో ఫేస్ బుక్ లైవ్ చాట్ సందర్భంగా సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
1992లో కమల్ హాసన్ తమిళ చిత్రం దేవర్ మగన్. తెలుగులో క్షత్రియ పుత్రుడు పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ స్టోరీ రాస్తున్న సమయంలో నా స్నేహితుడు భరతన్ ఓ ఛాలెంజ్ విసిరాడని తెలిపారు.
ఈ సినిమా స్టోరిని త్వరగా పూర్తిచేయకపోతే సినిమా నుండి తప్పుకుంటానని బెదిరించారని అయితే మా ఇద్దరిది చిన్నపిల్లలాట అని తెలుసు కానీ చెప్పినట్టుగానే ఏడు రోజుల్లో స్క్రిప్ట్ సిద్ధం చేశానని వెల్లడించారు. అయితే అన్నీ అలా రాయాలంటే కుదరదు. కొన్నింటికి సంవత్సరం కూడా పట్టొచ్చని వెల్లడించారు.ఈ సినిమాలో కమల్‌తో పాటు శివాజీ గణేషన్, రేవతి కీలకపాత్రల్లో నటించారు.