వెంకన్న ఆలయంలో వరాహం ప్రదక్షిణ..

203
lord balaji temple
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని గుట్టపై వింత చోటుచేసుకుంది . ఒక వరహం గుట్టపై నిర్మాణంలో ఉన్న ఆనంద గిరి వెంకటేశ్వర స్వామి నూతన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వింత గత రెండు రోజులుగా కొనసాగుతోంది.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచారం కావడంతో వింతను చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు.గుట్టపై ఆనంద గిరి వెంకటేశ్వర స్వామి కొలువుదీరాడు.స్వామివారి ఆలయం జీర్ణావస్థకు చేరుకోవడంతో నూతన గుడికి శ్రీకారం చుట్టారు.

స్వామివారి మూలవిరాట్ విగ్రహాలను గ్రామంలోని వేరే ఆలయంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం తుది దశలో ఉంది.అయితే నూతనంగా నిర్మిస్తున్న గుడి స్తంభాల చుట్టూ గుడి చుట్టూ గత రెండు రోజుల నుండి ఒక వరహం ప్రదక్షిణలు చేస్తుంది.ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి స్తంభం చుట్టూ తిరుగుతూ గుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది.

ఈ విషయాన్ని గుడి వాచ్ మెన్ గ్రామంలో చెప్పడంతో ఈ వింతను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి మూలవిరాట్ విగ్రహాలను ప్రతిష్టించాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -