రాజస్ధాన్‌లో మళ్లీ తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్‌..!

214
rajasthan
- Advertisement -

రాజ్యసభ ఎన్నికల వేళ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది బీజేపీ. మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కాంగ్రెస్ సక్సెస్ కావడంతో రాజస్ధాన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక మే 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు డబ్బులను ఎరగా చూపి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించని ఆ పార్టీ ఆరోపించింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించినట్లు కాంగ్రెస్‌ మండిపడింది. అయితే ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను ఢిల్లీ-జైపూర్‌ హైవేపై ఉన్న శివ విలాస్‌ రిసార్ట్‌కు తరలించింది కాంగ్రెస్.

రాజస్ధాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉండగా కాంగ్రెస్‌ పార్టీ 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు 12 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది కాంగ్రెస్‌. రాజస్థాన్‌లో మొత్తం మూడు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బలంతో కాంగ్రెస్ 2,బీజేపీ ఒకసీటును గెలుచోగలదు. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అండతో మరో రాజ్యసభ సీటను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలను గుప్పించింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఇంతవరకు స్పందించలేదు.

ఇక ఇప్పటికే కర్ణాటక, మద్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింది కమలం పార్టీ.

- Advertisement -