షూటింగ్‌లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌..

176
cm jagan
- Advertisement -

ఏపీలో సినిమా షూటింగ్స్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసింది. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటిలో చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నాని, టాలీవుడ్‌ ప్రముఖులు నాగార్జున, దిల్‌ రాజు, త్రివిక్రమ్‌, రాజమౌళి, సురేశ్‌ బాబు, సి, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించారు.

ఈ సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, ఏడాది కాలంగా సీఎం జగన్ ను కలవాలని అనుకుంటున్నామని తెలిపారు. జగన్ ను కలిసి తమ సంతోషాన్ని తెలియజేశామని వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపామని వివరించారు. రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు సీఎం అంగీకరించారని చిరంజీవి పేర్కొన్నారు.

ఇక 2019, 2020 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ఇచ్చేందుకు కూడా అంగీకరించారని తెలిపారు. థియేటర్ల టికెట్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, సినిమా టికెట్ల జారీలో పారదర్శకత ఉండాలని కోరామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను తోడ్పడతానని ముఖ్యమంత్రి చెప్పడం ఆనందదాయకమని చిరంజీవి తెలిపారు.

- Advertisement -