ఐపీఎల్‌ ఎఫెక్ట్: భారత్- ఆసీస్ టీ20 సిరీస్ రద్దు..?

232
india vs australia
- Advertisement -

కరోనా నేపథ్యంలో క్రికెట్ టోర్నమెంట్‌లు ప్రారంభంపై ఇంకా సందిగ్దం కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ సడలింపులతో ఆటగాళ్లు ప్రాక్టీస్ షురూ చేయడంతో త్వరలోనే క్రికెట్ టోర్నమెంట్‌లు ప్రారంభంకానున్నాయని అంతా సంబరపడ్డారు. ఇందులో భాగంగా తొలుత ఆసీస్- భారత్ మధ్య తొలి టీ20 సిరీస్ జరుగుతుందని భావించారు.

అయితే బీసీసీఐ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 సిరీస్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబరు – నవంబరు మధ్యలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆసీస్-భారత్ టూర్‌ రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.అయితే తొలుత ఆసీస్‌ టూర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీసీసీఐ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -