స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీకి ఇది 20వ సినిమా.
రీసెంట్‌గా విడుదల చేసిన బన్నీ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఒక్క లుక్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు బన్నీ. ఇక కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడగా తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో త్వరలో షూటింగ్‌లు ప్రారంభంకానున్నాయి.
అయితే పుష్ప మూవీ షూటింగ్ విషయంలో బన్నీ కీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో షూటింగ్ మరికొన్నిరోజులు వాయిదా వేయాలని భావిస్తున్నారట.ఈ టైంలో రిస్క్ తీసుకోవడం సరికాదని మేకర్స్‌కి సూచించారట బన్నీ. సో ఓవరాల్‌గా బన్ని పుష్ప…షూటింగ్ మరింత ఆలస్యంకానుందని టాక్.