ఈ ఏడాది మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది. జూన్ 5(నేడు) రాత్రి 11.16 గంటలకు ప్రారంభమై జూన్ 6 అర్థరాత్రి 2 గంటల 34 నిమిషాలకు ముగుస్తుంది. అర్థరాత్రి 12.55 గంటలకు గ్రహణం మధ్యస్థంగా ఉండగా దాదాపు 3 గంటల 18 నిమిషాల పాటు ఈ గ్రహణం సాగనుంది.
ఈ గ్రహణంలో చంద్రుడు.. భూమి వాస్తవిక ఛాయకంటే ముందే తన ఉపఛాయ నుంచి బయటకు వస్తాడు. ఫలితంగా చంద్రబింబం పూర్తిగా కనిపించదు. మొత్తం ఈ గ్రహణంలో ఎక్కడా చంద్రుడు సంపూర్ణంగా కనిపించడు.
సూర్యుడి కాంతి, వెలుతురు చంద్రుడిపై పడకుండా ఇలా భూమి అడ్డుగా రావడాన్నే చంద్రగ్రహణం అంటారు. పౌర్ణమి రోజు మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఐరోపా (యూరప్)లోని పలు దేశాలు, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహా సముద్రం ప్రాంతాల వారు చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఈ ఏడాదిలో తొలిసారి జూన్ 10న చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే.