- Advertisement -
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 5.0 నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం సినిమా ఇండస్ట్రికి మాత్రం షాక్ ఇచ్చింది.
సినిమా థియేటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడంతో పాటు ,ఈ నెలాఖరు వరకు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్ తర్వాతే పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు …కేంద్ర మంత్రి జావదేకర్‌తో వీడియో సమావేశం ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా జవదేకర్…జూన్ నెలకు సంబంధించి కొవిడ్-19 కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన తర్వాత సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -