ఏనుగు మృతిపై కేరళ సర్కార్,కేంద్రం సీరియస్

304
prakash javadekar
- Advertisement -

కేరళలో ఏనుగు మృతి చెందిన ఘటనపై కేరళ ప్రభుత్వం, కేంద్రం సీరియస్‌గా పరిగణించింది. ఏనుగు మృతికి కారణమైన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.

మరోవైపు కేంద్రం కూడా నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని పేర్కొంది. బాణాసంచా తినిపించి చంపడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.

ఆహారం కోసం తిరుగుతున్న ఏనుగు పైనాపిల్‌లో బాంబు పెట్టిన పండును తిన్నది. ఆ పండులో పేలుడు పదార్థాలు ఉండటంతో దాని దవడలు, నోటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధను తాళలేక సమీపంలోని ఓ నదిలోకి దిగింది. తన నోటిని నీటిలోకి ముంచి ఉపశమనాన్ని పొందింది. ఆహారం లేకపోవడం, గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో గతనెల 27న ప్రాణాలు విడిచింది. ఏనుగుకు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించగా అది నెలరోజుల గర్భిణి అని తేలింది. దీంతో ఏనుగు మృతిచెందిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -