ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా…ఆజట్టు కోచ్ రికీ పాంటింగ్‌పై ప్రశంసలు గుప్పించాడు. పాంటింగ్ తనకు తండ్రిలాంటి వాడని…తనపై ఆయన ప్రభావం చాలా ఉందన్నాడు.
ప్రాక్టీస్ సమయంలో తనను చిన్నపిల్లాడిలా చూసుకునే వాడని..పరిస్ధితులకు అనుగుణంగా ఎలా ఆడాలో నేర్పించాడని చెప్పుకొచ్చాడు హార్ధిక్. 2015 లో కొత్త కుర్రాడిగా, నేను హోర్డింగ్స్ పక్కన కూర్చునేవాడినని..ఆ సమయంలో రికీ నాతో కూర్చుని ఆట గురించి మాట్లాడేవాడన్నాడు. దీంతో తాను త్వరగా నేర్చుకోవడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు పాండ్య.
ఐపీఎల్‌తో హార్ధిక్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే పాండ్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్‌కోవిచ్‌తో హార్ధిక్ కొంతకాలంగా ప్రేమలో ఉండగాపెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టి అందరికి షాకిచ్చాడు హార్ధిక్.