- Advertisement -
ఇదేంటి పెళ్లి కాకుండానే భారత స్టార్ ఆల్ రౌండర్ తండ్రి కాబోతున్నాడా అని షాక్‌కు గురవుతున్నారా..?అవును మీరు చదివింది నిజమే. హార్ధిక్ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు హార్ధిక్.
తన ప్రేయసి నటాషాతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ …తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నా. ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. పాండ్యాకు క్రికెటర్లు విరాట్, రవి శాస్త్రి తో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్‌కోవిచ్‌తో హార్ధిక్ కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లిచేసుకోనుండగా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టి అందరికి షాకిచ్చాడు హార్ధిక్.
- Advertisement -