డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నామని అన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. నియంత్రిత సాగు విధానంపై సూర్యాపేట జిల్లా కోదాడ లో రైతులకు, అధికారులు కు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రణాళిక లోపం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, దళారుల మోసానికి రైతులు బలి కాకుండా ధర నిర్ణయించే శక్తి రైతుకు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని జగదీష్ రెడ్డి అన్నారు.
ప్రతి క్లస్టర్ లో వ్యవసాయాధికారులు, రైతు బంధు సభ్యులు విస్తృతంగా అవగాహన కలిపించి రైతులకు బాసటగా నిలవాలని మంత్రి కోరారు…ఈ పల్లెకు వెళ్లిన రైతన్నలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి మాటే మా మాట అంటూ నియంత్రిత సాగు విధానికి జై కొడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
అంతకు ముందు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా రైతులకు రుణా మాఫీ, రుణాల మంజూరు బట్వాడా చెక్కులను రైతులకు మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ ఛైర్మన్ న్ గొంగిడి మహేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రజాక్ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.