వేలేరు మండలంలోని షోడశపల్లి గ్రామంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన సమగ్ర వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతుబంధు అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి హాజరైయ్యారు.
ఈ సందర్భంగా పళ్ళ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత్వ పద్ధతిలో సమగ్ర వ్యవసాయ విధానము పాటించి.. రైతులు పండించిన పంటకు మంచి ధర పొందాలని తన అభిమతమని కెసిఆర్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విధానం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అత్యధికమైన రైతులు స్వాగతించినట్లు సర్వేలో తేలిందన్నారు. ప్రతి ఒక్కరూ నూతన సమగ్ర వ్యవసాయ విధానంను అమలు పరచి ప్రభుత్వానికి సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. శాస్త్రీయమైన పద్ధతులతో నూతన సమగ్ర వ్యవసాయ విధానం తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని.. రైతును రాజును చేయాలని అనేక విధాలుగా రైతు పక్షపాతిగా నిలిచిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కిందని రాజయ్య పేర్కొన్నారు. ఒకే రకమైన పంట వేయడం వల్ల రైతుకు లాభం జరగదని లాభసాటి పంటను.. డిమాండ్ ఉన్న పంటను రైతులు వేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన సమగ్ర వ్యవసాయ విధానంను రైతులకు పూర్తిగా అవగాహన కల్పించవలసిన బాధ్యత వ్యవసాయ అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధుల మీద ఉందని తెలియజేశారు.
సమగ్ర వ్యవసాయ విధానం అమలు పరచి.. దేశంలోనే ఆదర్శవంతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన.ఆ విధానంను రైతులంతా అమలు పరచాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రజాప్రతినిధుల చేత, రైతుల చేత సమగ్ర వ్యవసాయ విధాన పద్ధతులను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కెసిరెడ్డి సమ్మిరెడ్డి ఎంపిపి,చాడ సరిత జెడ్పిటిసి,పిట్టల శ్రీలత జడ్పీటీసీ ధర్మసాగర్, కీర్తి వెంకటేశ్వర్లు మండల అధ్యక్షులు,కొట్టే రమేష్ సర్పంచ్, కర్ర సమ్మి రెడ్డి సర్పంచ్ నారాయణగిరి,వెంకన్న రైతు సమితి కో ఆర్డినేటర్,రాజు రెడ్డి సర్పంచ్, వివిధ గ్రామాల రైతులు సర్పంచులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.