సీఎం కేసీఆర్ వెంటే..ధన్వాడ రైతుల ప్రతిజ్ఞ

294
kcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పిన విధంగా ఏ కాలంలో ఏ పంట వేయమంటే వారి మాట ప్రకారమే మా గ్రామ ప్రజలు అందరము అదేవిధంగా పంటలు వేస్తామని నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములలో KCR గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ధన్వాడ మండల రైతు సమన్వయ కమిటీ మెంబర్ నారాయణ స్వామి మాట్లాడుతూ ఒకప్పుడు వలసల జిల్లా కరువు జిల్లాగా ఉన్న ఉమ్మడి మహబూబ్న నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు వలసలు ఆపి తమ వ్యవసాయాన్ని చేసుకుంటున్నారని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్; రైతు బంధు ;అదేవిధంగా రైతు బీమా లాంటి పథకాలను పెట్టి రైతులను అందుకుంటున్నారు.

అంతేకాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేసి నీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది రైతుల మంచి కోసం తీసుకునే నిర్ణయమే అని కాబట్టి ధన్వాడ గ్రామ రైతులు మూకుమ్మడిగా ముఖ్యమంత్రి గారు ఏ పంట ఏమంటే ఆ పంట చేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

cm

- Advertisement -