కరోనా….అప్ డేట్స్

180
coronavirus
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి 213 దేశాలకు విస్తరించగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్‌ భారిన పడగా 3 లక్షల 39 వేల 904 మంది మృత్యువాతపడ్డారు.

వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 2 వేల 813 ఉండగా కరోనా నుండి కోలుకుని 21 లక్షల 58 వేల 450 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక అమెరికాలో ఇప్పటివరకు 97,647 మంది చనిపోయారు.

ఇక భారత్‌లో గత 24 గంటల్లో 6,088 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. 24 గంటల వ్యవధిలో 148 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3583 మందికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది.

- Advertisement -