కరోన విపత్కర పరిస్థితుల్లో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో వలస కార్మికులకు కల్పించిన వివిధ సౌకర్యాల గురించి గంగుల కేంద్రమంత్రికి వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫీల్డ్ లెవెల్లో సర్వే నిర్వహించి 6.47 లక్షల వలస కార్మికులను గుర్తించి వివరాలు సేకరించడం జరిగినది. వలస కార్మికులకు 7608.012 మెట్రిక్ టన్నుల బియ్యం మరియు రూ. 31.61 లక్షల నగదును వారికి పంపిణీ చేయడం జరిగినది. వలస కార్మికుల కల్పించిన వివిద సౌకర్యాలు మరియు యాసంగీ ధాన్యం కొనుగోలు గురించి వివరించారు మంత్రి గంగుల.
ఈ వన్ నేషన్- వన్ రేషన్ (ఇన్‌ట్రా స్టేట్ పోర్టబులిటీ- నేషనల్ పోర్టబులిటీ) కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఇప్పటి వరకు 96.40% లబ్దిదారుల యొక్క ఆధార కార్డులను రేషన్ కార్డుకు అనుసందానం చేయడం జరిగినది. ఈ వన్ నేషన్- వన్ రేషన్ కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో వుంది.
రూ. 500 లను వలస కార్మికుల పంపిణీ చేసిన నగదును రూ. 2,000 లకు పెంచాలని మరియు ఏప్రిల్ నెలలో ఇచ్చిన బియ్యాన్ని మే మరియు జూన్ నెలలో కూడా ఇవ్వాలని ఈ సందర్బంగా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.