లాక్ డౌన్‌లో వలస కూలీలను,నిరుపేదలను,పక్షులను,జీవరాసులను ఏవిధంగా ఆదుకుంటున్నారో..అదే విధంగా చెట్లను కూడా రక్షించడని చిన్నపిల్లల వైద్య నిపుణులు మార్కండేయులు అన్నారు. గత 50రోజులుగా కాలనీలలో,పార్కులలో చెట్లు మొత్తం ఎండిపోతుండటంతో గత నెల రోజులుగా అటు వైద్యంతో పాటు ఇటు చెట్లను పరిరక్షించే పనిలో పడ్డారు మార్కండేయులు.
ఈ సందర్భంగా మార్కండేయులు మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ని చూసినట్లు గత 15ఏళ్లుగా నేను ఏ రాజకీయ నాయకులను చూడలేదన్నారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో కొన్ని నెలల నుండి సంతోష్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎన్నో లక్షల మొక్కలను నాటేందుకు కృషి చేశారని తెలిపారు.
ఆయనను ఫాలో అవుతూ ప్రతీ రోజు నగరంలోని పలు ప్రాంతాలు తిరుగుతూ చెట్లకు నీళ్లుపోస్తూ ఎండిపోయిన కొమ్మలను తొలగిస్తున్నారు. ముందే ఎండాకాలం కావడంతో చాలా చెట్లు నీళ్లు లేక చనిపోతున్నాయని..కావున ప్రతీ ఒక్కరు మీ ఇళ్లలో,కాలనీలలో చెట్లను సంరక్షించండని సూచించారు.ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు చెట్లు నాటి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని ఛాలెంజ్ విసిరారు.