చిక్కుల్లో నాగబాబు..!

372
naga babu
- Advertisement -

మెగా బ్రదర్‌, సినీ నటుడు నాగబాబు చిక్కుల్లో చిక్కుకున్నారు. గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా తాజాగా కాంగ్రెస్ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను దేశభక్తుడిగా సంబోధించడంపై కేసు నమోదు చేసి విచారణ జరుపాలని కాంగ్రెస్‌ నాయకుడు మానవతారాయ్‌ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్దించేందుకు సర్వం ధారబోసిన గాంధీని అవమానిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన నాగబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అయితే సోషల్ మీడియాలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు నాగబాబు, తనకు గాంధీ అంటే గౌరవమని..ఆయన్ని కించపరచాలన్న ఉద్దేశం లేదన్నారు.

- Advertisement -