లాక్ డౌన్ 4.0 నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు అమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీకి అమోదం తెలపడంతో పాటు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధానపరమైన నిర్ణయాలకు అమోదం తెలిపింది.
రైతులకు కేంద్ర కేబినెట్ మరిన్ని రాయితీలు కల్పించింది. ధాన్యం నిల్వలపై పరిమితిని తొలగించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు ఆమోదం తెలిపింది.
ఎంఎస్‌ఎంఈలకు రూ.3లక్షల ప్యాకేజీని కేంద్రం మరింత విస్తృత పరిచింది. చిన్న పరిశ్రమలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్ గ్యారంటీ కల్పించింది. బొగ్గుగనుల వేలంపై కొత్త విధానానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 కోట్ల మంది వలసకార్మికులకు లబ్ధి చేకూరేలా మనిషికి 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలు , రెండు నెలలపాటు ఉచితంగా అందించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
సీనియర్ సిటిజన్స్‌కి సాయం చేసే ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని మార్చి 2023 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.