ఖమ్మం జిల్లా లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో ఖమ్మం బస్ స్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలి. అలాగే బస్సులో ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజ్ చేసినాకే టికెట్ ఇవ్వాలి అని మంత్రి పువ్వాడ సిబ్బందికి సూచించారు. మాస్క్ లేకుంటే టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు.
ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా కోదాడ డిపో బస్సులో శానిటైజర్ లేకపోవడంపై మంత్రి ఆగ్రహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్‌ఎంతో ఫోన్లో మాట్లాడి.. కండక్టర్‌కు శానిటైజర్ ఇవ్వని కోదాడ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని డిపోల పరిధిలోని అన్ని బస్సులకు విధిగా శానిటైజర్ అందించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. నిబందనలు అతిక్రమించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు. మంత్రి పువ్వాడ తోపాటు తనిఖీలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ పాల్గొన్నారు.