అన్నిరాష్ట్రాల సీఎస్‌లకు హోంశాఖ లేఖ..

226
union home ministry
- Advertisement -

అన్నిరాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. వలస కూలీల తరలింపు కోసం రాష్ట్రాలు మరియు రైల్వే శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

బస్సు, రైళ్ల వివరాలను వలస కూలీలకు చెప్పడంతో పాటు, అసత్య సమాచారాలపై వలస కూలీలకు స్పష్టత ఇవ్వాలని సూచించింది కేంద్రం.

వలస కూలీల కోసం మరిన్ని రైళ్లు, బస్సులు నడపాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. కాలినడకన నడిచి వెళ్లే వారికి సేదతీరడానికి సౌకర్యాలు, ఆహారం సరఫరా చేయాలని లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -