- Advertisement -
అవతార్ ట్రస్ట్ మరియు క్యాప్‌స్టెన్ వారి ఆధ్వర్యంలో నిర్వహులు ప్రసాద్ గుప్తా ఈ రోజు హైదరాబాద్‌లోని జంట నగరాలకు సంబంధించిన ట్రాన్సజెండర్స్ అందరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అయితే ట్రాన్సజెండర్స్ అండగా నిలవాలనే ఉద్యేశ్యంతో మొదటిగా ఎల్బీ నగర్ ఏరియాలో సుమారు 250 మందికి నిత్యావసర వస్తువులు అందించారు.
ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీద ప్రారంభించారు. ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన నిర్వహకులకు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని సంస్థలు, దాతలు పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగి శామ్యూల్, సంస్థ నిర్వహకులు శాంసన్ మరియు స్థానిక మాజీ కార్పొరేటర్ రవి పాల్గొన్నారు.
- Advertisement -