డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్..

373
Minister Harish Rao Double Bedroom Houses Opening
- Advertisement -

సిద్దిపేట నియోజకవర్గంలోని రావురూకుల, తోర్నాల గ్రామాల్లో నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు.నిరు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మించి ఇవ్వడం లేదని అన్నారు.

అంతేకాదు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇండ్లు నిర్మించి ఇస్తాం. దశల వారీగా పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అమ్మితే నేరుగా జైలుకే పంపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గరీబోళ్ల ఇళ్ల నిర్మాణాలకు కేవలం 40 వేలు ఇచ్చేవారు. అవి బేస్మెంట్ కూడా సరిపోయేవి కావు. ఇళ్లు పూర్తియేసరికి ఆ ఇంటి యజమాని అప్పుల ఊబిలో కురుకుపోయేవాడు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పేద వారిపై భారం పడకుండా ఇళ్లు నిర్మించి, తాళాలు చేతిలో పెట్టి కొత్త ఇళ్లకు తోలుతున్నదని మంత్రి హరీష్‌ తెలిపారు.

- Advertisement -