- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటి వినియోగంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో గోదావరిజలాల వినియోగంపై సీఎం కేసీఆర్ సమగ్రంగా చర్చించి.. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి గోదావరి నది పరివాహక జిల్లాల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కేటీ రామారావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డిలను ఆహ్వానించారు.
కాళేశ్వరంతోపాటు దేవాదుల, ఇతర ప్రాజెక్టుల ద్వారా 2020-21 నీటి సంవత్సరంలో ఎంత నీటిని వినియోగించుకోవాలనే దానిపై చర్చించనున్నారు.
- Advertisement -