ఆదాయం పెరగాలి..అవస్థలు పోవాలి: నిరంజన్ రెడ్డి

211
niranjan reddy
- Advertisement -

రైతుల ఆదాయం పెరిగి అవస్థలు పోవాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సమగ్ర వ్యవసాయ విధానంపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి , రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి వ్యవసాయరంగంలో నూతన అడుగులు పడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత చర్యలతో వ్యవసాయం లాభసాటిగా మారబోతుందన్నారు. నియంత్రిత పద్దతిలో వ్యవసాయం జరగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఆ వైపు రైతులు దృష్టి సారించాలన్నారు.

గిట్టుబాటు ధర కాదు కనీస మద్దతు ధరకు కూడా రైతాంగం అవస్థలు పడుతుందని… ఆ దుస్థితి నుండి రైతులు బయటపడాలన్నది ప్రభుత్వ కార్యాచరణ ఉద్దేశం అన్నారు. ప్రభుత్వ పథకాలు, సాగునీటి రాకతో పెద్ద ఎత్తున వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారని చెప్పారు.

వరి ఎక్కువగా పండించడం మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయని… కంది, ఆముదం, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, కుసుమ, ఆయిల్ పామ్ వంటి పప్పు, నూనె పంటల సాగు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా ఏ పంటలను రైతులకు సూచించగలమో చెప్పాలన్నారు.

అదే సమయంలో మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను అంచనా వేయాలని… ఇతర రాష్ట్రాల పంటల సరళి, అవసరాల మీద అధ్యయనం చేయాలన్నారు. విత్తనాలు ఎంతవరకు అందుబాటులో ఉంటాయి కసరత్తు చేయాలన్నారు. పంటల సాగుకు సంబంధించి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కావాలి ? ప్రభుత్వం ఏం సమకూర్చాలి ?అన్నది అధికారులు నివేదిక తయారుచేయాలన్నారు.

వనరులున్నా మనదేశం అమెరికా, చైనాలను ఎందుకు ఉత్పత్తిలో ఢీ కొట్టలేకపోతుందని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. మార్కెటింగ్, ఉత్పత్తి విషయంలో ఆ దేశాలను ఎదుర్కొనేలా వ్యవసాయ నిపుణులు పరిశోధనలు చేయాలన్నారు. మనదేశంలో కొంతశాతం జనాభా మాత్రమే తాము కావాలనుకున్నవి తినగలుగుతున్నారు .. మెజారిటీ ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఆకలి తీర్చుకునే స్థితికి వచ్చారన్నారు.

ఈ స్థితి నుండి ప్రజలంతా కోరుకున్న ఆహారం తినగలిగే పరిస్థితి రావాలని…. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వీడియో కాన్ఫరెన్స్ తో సమగ్ర వ్యవసాయ విధానంపై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.

- Advertisement -