వలస కార్మికులపై మానవత్వం చూపాలి- కేసీఆర్‌

352
CM KCR On Migrant labourers
- Advertisement -

వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ట్రాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మనది సెంటిమెంటు కలిగిన దేశం. సొంతూర్లో పిల్లలను, తల్లిదండ్రులను వదిలి వచ్చారు. సొంత వాళ్లను చూసుకోవాలని వారికి ఉంటుంది. అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారు. వారిని పోనివ్వకపోతే అనవసరం ఆందోళన తలెత్తుతుంది. ఒకసారి పోయి వస్తే, వారు స్థిమిత పడతారు. మళ్లీ పనిలోకి వస్తారు. శ్రామిక్ రైళ్లు వేయడం మంచి నిర్ణయం అన్నారు సీఎం.

తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నం. మళ్లీ ఆ కూలీలు వస్తున్నారు. తెలంగాణ రైసు మిల్లులలో పనిచేసే బీహార్ కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ తెలంగాణకు వచ్చారు. వారిని మేము సాదరంగా స్వాగతించాం. వస్తారు, పోతారు. రానివ్వాలి, పోనివ్వాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -