ఎన్నారై తెరాస యూకే ఆధ్వర్యంలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడ్తున్న ప్రవాస విద్యార్థులకే కాకుండా క్షేత్రస్థాయిలో పేదలకు కూడా సేవ చేస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో నేడు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ చేతుల మీదుగా స్థానికడు,ఎన్నారై తెరాస సభ్యుడు (షఫిల్డ్ పట్టణం) అరవింద్ రెడ్డి సహకారంతో సుమారు వందకు పైగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. ఎన్నారై తెరాస యూకే విభాగం అక్కడున్న విద్యార్థులకే కాకుండా మాతృభూమిపై బాధ్యతతో ఇక్కడున్న పేదలకు కూడా సేవలందించడం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని,మన కుత్భుల్లాపూర్ స్థానికుడు అరవింద్ రెడ్డి తాను పుట్టినగడ్డను మర్చిపోకుండా తన వంతు బాధ్యతగా వందకు పైగా పేదలకు సహాయం అందించడాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా పిలవగానే కార్యక్రమానికి హాజరై ప్రోత్సహించిన ఎమ్మల్యే వివేకానంద్‌కి,స్థానిక కార్పొరేటర్ వీరేందర్ రెడ్డికి,ఎన్నారై తెరాస ఇండియా కోఆర్డినేటర్ మల్లేష్ పప్పుల,స్థానిక తెరాస నాయకులకు మరియు దాతలు అరవింద్ రెడ్డికి మరియు వారి తల్లితండ్రులకు ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఫోన్ ద్వారా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
యుకేలోని షఫిల్డ్ పట్టణంలో స్థానిక కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్నారై తెరాస సభ్యులు,నిత్యావసర సరుకుల దాత అరవింద్ రెడ్డి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే వివేకానందకి మరియు ఎన్నారై తెరాస యూకే కార్యవర్గానికి, అనిల్ కూర్మాచలంకి, స్థానిక వివిధ డివిజన్ నాయకులు సుధాకర్,ఆగం రాజు,ఆగం పండు,బాలాజీ నాయక్‌లతో పాటు స్థానిక నాయకులు సమ్మెట వెంకన్న బాబు,వెంకటేష్ పటేల్,సుధాకర్ రెడ్డి, తదితరులకు కృతఙ్ఞతలు తెలిపారు.