- Advertisement -
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తనికెళ్ళ, సింగరాయిపాలెం గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాట్లు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీలు, రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పువ్వాడ.
కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్,ఎమ్మెల్యే రాములు నాయక్,మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ పాల్గొన్నారు.
- Advertisement -