పెద్దపల్లి జిల్లా సుందిల్ల వద్ద నిర్మించిన సరస్వతి పంప్ హౌస్, గోలివాడ వద్ద పార్వతి పంప్ హౌజ్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ సందర్శించారు. పెండింగ్ పనులను పరిశీలించి వాటిని పూర్తి చేయటం కోసం అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రత్యేక హెలికాప్టర్‌లో సిరిపురం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజ్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగారు. అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన వాహనంలో కాన్వాయ్ ద్వారా సరస్వతి పంప్ హౌస్‌కు చేరుకున్నారు. పంప్ హౌస్‌లో జరుగుతున్న పెండింగ్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోలివాడ పార్వతి పంప్ హౌజ్‌ను అధికారులతో కలసి పరిశీలించిన మంత్రి ఈటెల రాజేందర్ ప్రాజెక్టు క్యాంప్ అఫీస్‌లో అధికారులతో పనులు జరుపటంపై సమీక్ష జరిపారు.
లాక్ డౌన్ కారణంగా నలబై రోజులుగా నిలిచిపోయిన పనులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తు కరోనా జగ్రత్తలతోల తిరిగి ప్రారంబించలని సూచించారు. జిల్లా వైద్యులు,ఆశ వర్కర్లతో మాట్లాడుతు ఏమైనా కరోనా కేసులు నమోదయ్యాయని.. ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, ఇరిగేషన్ అడ్వైజర్ పెంటా రెడ్డి, ఈఎన్సి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎజేన్సిల ప్రతినిధులు ఉన్నారు.