రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష..

179
- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా వైరస్‌ కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్‌ నివారణ,లాక్‌డౌన్‌ సడలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వలస కార్మికుల తరలింపుపై చర్చిస్తున్నారు. ఈ నెల 5న క్యాబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 1061 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు.

- Advertisement -