వాక్ ఫర్ వాటర్ సంస్థ చొరవ ప్రశంసనీయం: నిరంజన్ రెడ్డి

255
niranjan
- Advertisement -

వాక్ ఫర్ వాటర్ సంస్థ చొరవ ప్రశంసనీయం అని కొనియాడారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ మూసాపేటలో వాక్ ఫర్ వాటర్ పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని సందర్శించారు నిరంజన్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతికూల పరిస్థితులలో రైతులకు అండగా నిలిచామన్నారు.

ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల అపూర్వ స్పందన వచ్చిందన్నారు. 28 లక్షల హిట్లను తాకిన మిస్డ్ కాల్ సెంటర్ అని జంటనగరాలలో ఇప్పటివరకు 71 వేల కుటుంబాలకు రైతులనుండి 11 వందల 25 టన్నుల పండ్ల సరఫరా చేశామన్నారు. మరిన్ని నాణ్యమైన సేవల కోసం తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

వాక్‌ ఫర్ వాటర్‌, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండన్నారు. ప్రతి ఒక్కరూ 5 కిలోల బత్తాయి, మామిడి పండ్లు తీసుకుంటే ఉత్పత్తిలో 50 శాతం ఇక్కడే వినియోగమవుతుందన్నారు.

300 కు ఆరురకాల పండ్ల కాంబో ప్యాక్ తో పాటు రూ.300 కు 5 కిలోల పండ్లు, సేంద్రీయ, ప్రత్యేక రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయని 88753 51555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఇంటి వద్దకే పండ్లను అందించే ప్రయోగం బాగుందన్నారు.

- Advertisement -