- Advertisement -
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు జస్టిస్ విజయ సేన్ రెడ్డి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్…విజయసేన్ రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఇక ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా కృష్ణ మోహన్, కే సురేశ్ రెడ్డి, లలిత కుమారి సైతం ప్రమాణస్వీకారం చేశారు.
1994 లో ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా చేరారు విజయసేన్ రెడ్డి. హైకోర్టులో కేసులను తీసుకునే ముందు సబార్డినేట్ కోర్టులు మరియు ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. విజయసేన్ రెడ్డి తండ్రి దివంగత బి. సుభాషన్ రెడ్డి మద్రాస్, కేరళ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. సుభాషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్ గా సేవలందించారు.
- Advertisement -