- Advertisement -
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1993 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా పరిస్థితులపై వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
తద్వారా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 35,043కి చేరాయని, 25,007 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. 8,889 మంది కోలుకున్నారని, ఇప్పటివరకు 1,147 మంది మరణించారని అగర్వాల్ పేర్కొన్నారు. అటు, దేశంలో 130 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయని తెలిపారు.
- Advertisement -