ఏ పేదింటి కుటుంబం, వలస కూలీలు ఆకలితో అలమటించ కూడదు అనే సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎంపీ సంతోష్ కుమార్ సూచనలతో వలస కూలీలు,పేదలకు రామగుండం పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబి గెస్ట్ హౌస్ వద్ద నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలా తరలింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూలీలు వెళ్ళేటప్పుడు కడుపునిండా భోజనం పెట్టి వారి రాష్ట్ర సరిహద్దులకు తరలిస్తున్నారు సిపి సత్యనారాయణ. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ కేంద్రం సూచనలను, కేసీఆర్ పిలుపు దృష్టిలో పెట్టుకొని సిపి సత్యనారాయణకు సూచన చేయడం జరిగింది.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆదిలాబాద్,మహారాష్ట్రలకు సరిహద్దు జిల్లా కావడంతో మంచిర్యాలలో ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో నిత్యాన్నదానం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈరోజు 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిపి సంత్యనారాయణ,డిసిపి ఉదయ్ కుమార్,సిఐ ముత్తి లింగయ్య, ఎసై లు రాజమౌళి గౌడ్, ప్రవీణ్, మారుతిలు మరియు తదితరులు పాల్గొన్నారు.