- Advertisement -
బాలానగర్ ఫ్లైఓవర్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు భూ సేకరణకు సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. గురువారం జిహెచ్ఎంసి నందు కూకట్ పల్లి శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు, సిసిపి దేవేందర్ రెడ్డిలతో కలిసి సంబంధిత ఆస్తుల యజమానులతో భూ సేకరణ,టిడిఆర్ ల జారీ గురించి చర్చించారు.
భూ సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని, మధ్యలో వున్న కొన్ని ఆస్తుల యజమానులు చెపుతున్న అభ్యంతరాల వలన పనులను సమగ్రంగా చేపట్టుటకు ఇబ్బంది కలుగుతున్నట్లు తెలిపారు.పనులను ఒక దశకు తెచ్చేందుకు లాక్ డౌన్ పీరియడ్‌కు మించిన అవకాశం మరల రాదని వివరించారు.
బాలానగర్ రహదారి 24 గంటలు రద్దీగా ఉంటుందని,లాక్ డౌన్ తర్వాత ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టమని చెప్పారు. అలాగే భూ సేకరణ తర్వాత మిగిలిన ఆస్తులు,నిర్మాణాలను సరిచేసుకునేందుకు కూడా ఇప్పుడే సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.
- Advertisement -