కేటీఆర్‌కు ట్వీట్..దక్షిణాఫ్రికాలో సాయం.!

499
ktr
- Advertisement -

కరోనా వైరస్‌తో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు సాయం అందించాలని కోరిన వెంటనే స్పందిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.

దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకోవాలని రవితేజ అనే తెలంగాణ ప్రవాస ఉద్యోగి మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌ ద్వారా కోరారు.

దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్‌ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెరాస దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజుకు సూచించారు. దీంతో ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్లిన నాగరాజు 15 రోజులకి సరిపడే నిత్యావసర సరుకులను అందించారు.

దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకోవాలని జాగృతి అద్యక్షురాలు కవితని యాద కిరణ్ కోరగా గుర్రాల నాగరాజు వారికి కావాల్సిన సమాచారాన్ని అందించి కాన్సులెట్ ఆప్ ఇండియా జోహనేస్ బర్గ్ కి సమాచారాన్ని అందించారు.

ktr ktr ktr ktr

- Advertisement -