- Advertisement -
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రక్తదాన శిబిరం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చెప్పారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో రక్తదాన శిబిరాలలో రక్తం లేక అవస్థలు పడుతున్నారు అంటూ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు అందరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.
- Advertisement -