నల్గొండ కాలెక్టర్ కార్యాలయంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై, ధాన్యం కొనుగోళ్లు, బత్తాయి ఎగుమతులపై, అధికారులుతో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య,నల్లమోతు భాస్కర్ రావు,నోముల నరసిమయ్య,రవీంద్ర కుమార్,,కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌లు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనాపై అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాం. ఫలితంగా కరోనా కట్టడి అయింది. సూర్యాపేటలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. గత 6 రోజులుగా ఒక్క పాజిటివ్ కేస్ కూడా నమోదు కాలేదు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు వచ్చాయి. ప్రతి గింజను ప్రభుత్వం మే కొనుగోలు చేస్తున్నది. కొనుగోళ్లు అన్ని సజావుగా సాగుతున్నాయి. రవాణా సదుపాయం, గాన్ని బ్యాగ్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాము. అకాల వర్షాలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నాము. రైతును రాజును చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.